అమరావతి: డిప్లామెటిక్‌ ఔట్‌ రీచ్‌ సదస్సులో... సీఎం వైఎస్ జగన్‌ ప్రసంగాన్ని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తప్పుబట్టారు. సదస్సులో వనరులు, రాష్ట్రంలో జరిగిన ప్రగతిని వివరించాలని పేర్కొన్నారు.సాధించిన ఓట్లు, వచ్చిన సీట్లు చెబితే పెట్టుబడులు రావని లోకేష్ ఎద్దేవా చేశారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌, పాలనలో వచ్చిన 700 అవార్డుల గురించి చెప్పాలన్నారు. గత ప్రభుత్వం సాధించిన ఘనతను చెప్పలేక.. పేద రాష్ట్రం అని జగన్‌ చెబుతున్నారని లోకేష్ విమర్శించారు.