కాషాయానికి తెలుపు పిచ్చి...

హర్యానా: జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై స్పందించిన హర్యానా ముఖ్యమంత్రి.. కశ్మీర్ అమ్మాయిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో పాల్గొన్న మనోహర్‌లాల్ ఖట్టర్..‘మంత్రి ఓపీ ధన్‌ఖర్ బీహార్ నుంచి కోడళ్లను తీసుకొస్తానని చేప్పేవారు. ఇప్పుడు కశ్మీర్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చేందుకు లైన్‌ క్లియర్ అయింది.’ అని వ్యాఖ్యానించారు. అయితే ఖట్టర్ ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించిన విషయంలో గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కాగా.. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కూడా తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దేశంలోని ముస్లిం యువకులు ఇక నుంచి అందంగా, తెల్లగా ఉన్న కశ్మీరీ బాలికలను ఎలాంటి భయం లేకుండా పెళ్లాడొచ్చనే ఆనందంలో ఉన్నారని ముజఫ్ఫర్‌నగర్ ఎమ్మెల్యే విక్రం సైనీ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు కశ్మీరీ అమ్మాయిలపై చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.