ఢిల్లీ: టీం ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవ లెఫ్ట్‌నెంట్ కర్నల్  హోదాలో జాతీయ జెండాను ఎగరేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ టోర్నీ అనంతరం క్రికెట్‌కు విరామం ప్రకటించిన మహీ.. సైన్యంలో చేరి జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో సైన్యంలో చేరిన ధోనీ.. ఆగస్ట్ 15 వరకు విధులు నిర్వర్తించనున్నాడు. అయితే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవ లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాలో లేహ్ ప్రాంతంలో జాతీయ జెండాను ఎగరేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించాల్సి ఉంది.