చిత్రం: మన్మధుడు2

రేటింగ్ : 2.5/5 

నటీటీనటులు:  నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ల‌క్ష్మి, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని మొదలగువారు.
సంగీతం: చైత‌న్య భ‌రద్వాజ్‌
ఛాయాగ్రహణం:  ఎం.సుకుమార్‌
మాటలు: కిట్టు విస్సా ప్రగ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌
నిర్మాత‌లు: నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌
ద‌ర్శక‌త్వం: రాహుల్ ర‌వీంద్ర‌న్‌

మన్మధుడు2 అని పేరుపెట్టటంతో సహజంగానే 2006, మన్మధుడిని ప్రేక్షకులు ఊహించుకోవటం సహజం. నిర్మాత,దర్శకుల ఉద్దేశం కూడా అదే అయి ఉండవచ్చు. కాకపోతే పేరు తప్ప ఈ చిత్రానికి మన్మధుడు సినిమాకు  ఏ మాత్రం సంబంధం లేక పోవడం ఒక విధంగా చిత్రానికి మైనస్ అనే చెప్పాలి. వయసు పెరుగుతున్న కొద్ది మరింత గ్లామరస్ లుక్కుతో  నిజంగానే మన్మథుడు అనిపించుకుంటున్నాడు కింగ్‌ నాగార్జున. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుడే కింగ్, ఇప్పుడు  ‘ఐ డూ’ అనే ఫ్రెంచ్‌ రొమాంటిక్‌ కామెడీని తెలుగులో రీమేక్‌ చేశాడు. చిలసౌ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరోసారి మన్మథుడుగా అలరించే ప్రయత్నం చేశాడు నాగ్‌. మరి ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? రాహుల్ దర్శకుడిగా మరో విజయాన్ని అందుకున్నాడా..?ఆ విషయం పక్కన పెడితే మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నాగార్జున ఇమేజ్ కు తగ్గట్టు ఈ చిత్రం ఉందా లేదా, చిత్రా కథతో సంబంధం లేక పోయిన చిత్ర స్థాయి మన్మధుడుతో పోటీ పడుతుందా లేదా? చూద్దాం రండి... 

కథ:  సాంబశివరామ్ అలియాస్ సామ్ (నాగార్జున) పోర్చుగల్ లో సెటిలైన ఓ తెలుగు   వాడు. ఫ్లాష్ బ్యాక్ లో  తన లవ్ ఫెయిల్యూరు అవటంతో ప్లే బోయ్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు.  ప్రేమ, పెళ్లి వంటివి అతని వంటికి పడవు. . జీవితంలో ఎప్పటికి పెళ్లి చేసుకోకూడదు అని తీర్మానించుకున్న అతనికి, ఇంట్లో వాళ్ళకోసం పెళ్లికి ఓకే అనాల్సి వస్తుంది. అయితే పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉండదు. ఇంట్లో వాళ్లని నొప్పించకూడదు...తను సఫర్ అవకూడదు అని ఇప్పటికే,  లెక్కపెట్టలేనంతమంది హీరోలు, హెరోయిన్లు వేసినట్టే ప్లాన్ వేసి, అవంతిక(రకుల్ ప్రితి సింగ్) అనే అమ్మాయిని ..గంటకు రెంటుకు మాట్లాడుకొని  గర్ల్ ఫ్రెండ్ గా నటించటానికి తన ఇంటికి తీసుకు వస్తాడు. 

దాదాపు పన్నేండేళ్ల క్రితం వచ్చిన `మన్మథుడు` సినిమా ఇప్పటికీ టీవీల్లో వచ్చినా జనాలు చూస్తూనే ఉన్నారు  త్రివిక్రమ్ పంచ్ డైలాగులు, విజయ్ భాస్కర్ దర్శకత్వం, బ్రహ్మానందం కామెడీ ఇప్పటికీ జనం అదరిస్తూనే ఉన్నారు. ఆ స్థాయిలో చెప్పటానికి ఇందులో ఏమి లేదు. దర్శకుడుగా రాహుల్ రవీంద్ర ఫరవలేదనిపించినా, కథలో కొత్తదనం లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు? ఇలాంటి సినిమాలు చూసి చూసి అలసిపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా చూడటం ఒక రకంగా పరీక్షే. పాత్రలు, వాటి మధ్య సంఘటనలు చాలా చోట్ల తేలిపోయాయి. వెన్నెల కిషోర్ కామెడీ కామెడీ ప్రేక్షకులకు రేలీఫ్ ఇస్తుంది. మంచి హాస్య నటుల్లో ఒకడైన కిషోర్, తన ఈజ్ తో పాత్రకు న్యాయం చేసి, ప్రేక్షకులు కట్టిన డబ్బులకు కొంతవరకూ న్యాయం జరిగేటట్టు చూశాడు. మిగతా సినిమా అంతా కొత్త పాకెట్లో పాత స్వీటే. 

విశ్లేషణ:
సినిమా బాగా సా....గింది. 

 రాహుల్ రవీంద్రన్ సినిమా అనిపించదు. సినిమాటోగ్రఫీ ఇప్పుడు అన్నీ సినిమాలలో బాగా ఉంటోంది. అదే బాణీలో ఇందులో కూడా  పోర్చుగీసును ఎంత బాగా చూపించ వచ్చో అంతా బాగా చూపించగలిగారు. సంగీతం గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమి లేదు. సినిమా బాగా సా....గింది. కొంచెం తగ్గిస్తే బాగుండేది. నాగార్జున, రాకుల్  తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా పెద్ద చెప్పటానికి ఏమి లేదు. మన్మధుడు2కన్నా గ్రీకువీరుడు2 అంటే సినిమాకు న్యాయం జరిగి ఉండేది.

తెరముందు స్టార్స్:

నాగార్జునకి ఇలాంటి చిత్రాలు, పాత్రలు కొట్టిన పిండి. అలాగే రకుల్ ప్రీతి సింగ్ కూడా బాగానే చేసింది. మిగతవారంతా తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది వెన్నెల కిషోర్ గురించి. వెన్నల కిషోర్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ఆకర్షణ. ఈ చిత్రానికి స్టార్ పెర్ఫార్మర్ వెన్నల కీషోరే. 

తెరవెనుక స్టార్స్: 

చిత్రం ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సుకుమార్ ఛాయాగ్రహణం కనుల విందు చేస్తుంది. మిగతా సంగీతం, మాటలు, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ గురించి చెప్పటానికి ఏమి కనిపించదు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన ముందు సినిమాతో పోల్చుకుంటే ఈ చిత్రంతో నిరాశ పరచాడు. ఏమైనా అక్కడక్కడా దర్శకుడి ప్రతిభ కనిపించినా నాగార్జునే ఇంతముందు చాలా సార్లు నటించిన ఇలాంటి కథ ఎందుకు ఎన్నుకున్నాడో, ఇలాంటి సినిమాని ఆయన నిర్మాతగా ప్రజలముందుకు తీసుకొచ్చాడో వాళ్ళకే తెలియాలి.

Disclaimer : This Review is an Opinion of a single person.  Please do not judge the movie based on this review. Watch the Movie on screen.