మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బాగానే ఉన్నారని, ఆల్ ఇండియా ఇనిస్టిటిట్యూట్ ఆఫ్  మెడికల్ సైన్సెస్ లో శుక్రవారం నాడు అడ్మిట్ అయిన ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఆసుపత్రి వైద్యులు నిన్నఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జైట్లీ ఆరోగ్యం గురించి వాకబు చేయగా, ఆయన వైద్యానికి బాగా స్పందిస్తున్నట్టు తెలిపారు. 
ఆయనకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స చేస్తున్నారు

ఎండోక్రైనాల్జిస్ట్, నెఫ్రాలజిస్ట్, కార్డియాలజిస్టుల  వైద్యుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి పరిశీలిస్తూ ఉంది. 

గత రెండు సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పోయిన సంవత్సరమే  మూత్రపిండం మార్పిడి చేయించుకున్నారు.