జోమాటోలో కొన్ని రోజుల క్రితమే హిందూ డెలివరీ బాయి తీసుకురాలేదని, ఆర్డర్ కాన్సెల్ చేసిన ఘటన మరువక ముందే,   హిందూ, ముస్లిం డెలివరీ బాయ్స్ సోమవారం నుంచి స్ట్రైక్ చేయబోతున్నారు. పోర్క్, బీఫ్ పదార్థాల డెలివరీకి నిరసనగా వారు స్ట్రైక్ చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆహార పదార్థాలకు మతం లేదు, ఆహారమే ఒక మతం అంటూ కంపెనీ చేసిన ట్వీట్ సోషల్ మాధ్యమాలలో ఎంతోమందిని ఆకర్షించింది. అయితే ఈ సారి వారికి సమస్య బయట నుంచి కాక కంపెనీ ఉద్యోగుల రూపంలో ఎదురయ్యింది. వారు సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు వారి మాత విశ్వాసాలను బాధిస్తున్నాయంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.  బక్రీద్ పండుగ సమయంలో బీఫ్, పోర్క్ సరఫరాకు వ్యతిరేకంగా సోమవారం నాడు వారు గళమెత్త బోతున్నారు. 

జోమాటో కంపెనీ తమ జీతాలని పెంచటం, మతవిశ్వాసాలు దెబ్బతినకుండా వ్యవఃరించడం అనేవి వారి  జోడు డిమాండ్లు.
 ఇప్పుడు హిందూ, ముస్లిం రెండు మతాలకి చెందిన ఫుడ్ డెలివరీ బాయ్స్ తమ మత విశ్వాసాలకి వ్యతిరేకంగా పనిచేయమంటున్నారు. 
తమ పై అధికారులకు ఈ విషయాలు తెలిపినా వారి నుండి ఎటువంటి స్పందనా లేదంటూ వారు తెలిపారు.