64 ఇన్నుంగుల మియందాద్  26 ఏళ్ల రికార్డు 34 ఇన్నింగులలో బద్దలు...
 
ట్రినిడాడ్‌: ప్రపంచ క్రికెట్ రెకార్డులు బద్దలు కొట్టడం అలవాటుగా మార్చుకున్న, భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన రికార్డును  చేధించాడు. వెస్టిండీస్‌పై వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును నమోదు చేసేందుకు 19 పరుగుల దూరంలో ఉన్న  కోహ్లి, విండీస్‌తో ఈ రోజు జరిగిన మాచ్ లో అలవోకగా పాకిస్తాన్‌ దిగ్గజ ఆటగాడు జావేద్‌ మియాందాద్‌ పేరిట ఇన్నాళ్ళు పదిలంగా ఉన్న రికార్డు  తుడిచిపెట్టాడు.  విండీస్‌పై మియాందాద్‌ 1930 వన్డే పరుగులు చేసి ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్నాడు. 

జావేద్‌ ఈ పరుగుల్నిచేయడానికి 64 ఇన్నింగులలో  తీసుకున్నాడు. కాగా, విండీస్‌తో రెండో వన్డేలో కోహ్లి ఈ మార్కును  34 ఇన్నింగ్స్‌లోనే అధిగమించాడు. 

ఇప్పటివరకూ విండీస్‌పై వన్డే ఫార్మాట్‌లో కోహ్లి 70 పైన యావరేజి  రన్నులతో 
7 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీలు చేశాడు. అయితే, మియాందాద్‌ కేవలం ఒక్క
సెంచరీ మాత్రమే విండీస్‌పై చేసి,  12 అర్థ శతకాలు నమోదు చేశాడు.  
1993లో మియాందాద్‌ తన చివరి వన్డేలో ఈ ఫీట్‌ సాధించాడు. మియాందాద్‌
26 ఏళ్ల రికార్డును  కోహ్లి బ్రేక్‌ చేశాడు.