అహ్మదాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌‌కు దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతమైంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, జవాన్లు రంగంలోకి దిగారు. వరదప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశారు. అలా వెళ్లిన వారికి ఓ చోట ఇద్దరు చిన్నారులు కనిపించారు. ఎటు చూసినా కనుచూపుమేర వరదనీళ్లే కనపడుతున్నాయి. గట్టుకు చేరే పరిస్థితిలేదు. తీవ్ర భయాందోళనతో ఉన్నవారిని.. పోలీస్ కానిస్టేబుల్ పృథ్విరాజ్ సింగ్ జడేజా తన భుజాలపైకి ఎత్తుకుని.. వరదనీటిలో నడుచుకుంటూ గట్టుకు చేర్చారు. ఈ విషయం గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దృష్టికి వెళ్లగా.. సదరు కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.