అమితాబ్ తల్లి తేజీ బచ్చన్ పాక్‌లోని లయాల్ పూర్‌లో జన్మించారు. లయాల్‌పూర్‌ను ఫైసలాబాద్ అని కూడా పిలుస్తుంటారు. సిక్కు కుటుంబానికి చెందిన తేజీ బచ్చన్ తండ్రి పేరు సర్దార్ ఖజాన్ సింగ్. ఆయన పంజాబ్‌లో బారిస్టర్‌గా ఉండేవారు.  షారూఖ్‌ఖాన్ తండ్రి మీరా తాజ్ మొహమ్మద్ పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. ఆయన ‘భారత్ ఛోడో’ ఉద్యమంలో పాల్గొన్నారు. విభజన అనంతరం ఆయన ఢిల్లీకి వచ్చేశారు.  గోవిందా తండ్రి, బాలీవుడ్ నటుడు అరుణ్ కుమార్ అహూజా పాకిస్తాన్‌లో జన్మించారు. విభజన అనంతరం ఆయన భారత్ వచ్చేశారు.
రాజ్ కపూర్‌: రాజ్, అతని తండ్రి పృధ్విరాజ్ కపూర్‌లు పాక్‌లోని పెషావర్‌లో జన్మించారు. ఈనాటికీ అక్కడ వీరి కుటుంబ వ్యాపారాలు నడుస్తున్నాయని చెబుతుంటారు.