గ్రామ సచివాలయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆదివారం కూడా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవ నోటిఫికేషన్‌ ప్రకారం శనివారం రాత్రి 11.59 గంటలకు గడువు ముగిసింది. అయితే, రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వరదల దృష్ట్యా సీఎం జగన్‌ ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకునే గడువును ఒక రోజు పెంచుతున్నట్లు గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ గిరిజాశంకర్‌ శనివారం తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల దరఖాస్తుల కోసం 11వ తేదీ(ఆదివారి అయినప్పటికీ) రాత్రి 12 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.