సి‌ఐ పై కేసు నమోదు....

హైదరాబాద్:   17వ పోలీస్‌ బెటాలియన్‌ పనిచేస్తున్న సీఐపై అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నందుకు గాను  సిరిసిల్ల లక్షెట్టిపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైయ్యింది. అవంతికకు హైదరాబాద్‌కు చెందిన సిరిసిల్ల 17వ బెటాలియన్‌లో పని చేస్తున్న సీఐ పూనం శ్రీనివాస్‌తో   2018లో వివాహమైంది. పెళ్లి సమయంలో శ్రీనివాస్‌కు రూ. 5 లక్షల నగదు, 5 తులాల బంగారం వరకట్నం కింద ఇచ్చారు. వివాహమైన ఆరు నెలలపాటు వీరి సంసారం సజావుగా సాగింది. అనంతరం శ్రీనివాస్‌ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ మద్యం తాగి వచ్చి అదనపు కట్నం కోసం అవంతికను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇటీవల ఇతర మహిళలతో ఫోన్‌లో చాటింగ్‌ చేయడాన్ని పసిగట్టిన అవంతిక భర్తను నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. శ్రీనివాస్‌ అవంతికను ఎక్కువ వేధింపులకు గురి చేశాడు. 
మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురి చేయడంతో భరించలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గౌరవ ప్రదమైన యూనిఫార్మ్ ధరించి, ఉన్నత పదవిలో ఉంటూ పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన అధికారులు ఇలా ప్రవర్తించటం దారుణం.