అభిమానుల తరుపున మలయాళం సూపర్ స్టార్ క్షమాపణ..
..
మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి క్షమాపణ చెప్పారు. ఇందుకు కారణం ఆయన వీరాభిమానులే. ఆ కథేంటో చూద్దాం. ఇటీవల 66వ జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తరాది చిత్రపరిశ్రమతో పాటు దక్షిణాదిలో ఒక్క తమిళచిత్ర పరిశ్రమ మినహా అన్నీ సినీ పరిశ్రమలను ఈ అవార్డులు వరించాయి. తమిళంలో కూడా  రెండు జాతీయ అవార్డులతోనే  సరిపెట్టుకోవలసి వచ్చింది. కాగా మమ్ముట్టి అభిమానులు అవార్డుల కమిటీ చైర్మన్‌ రాహుల్‌ రవిపై దండయాత్ర చేస్తున్నారు. ఆయన ఫేస్‌బుక్‌లో ఇస్టానుసారంగా ఏకేస్తున్నారు. పరుష పదజాలంతో దూషిస్తున్నారు. అందుకు కారణం మమ్ముట్టి నటించిన చిత్రానికి ఒక్క జాతీయ అవార్డు కూడా రాకపోవడమే. మమ్ముట్టి మలయాళంలోనూ కాకుండా తమిళం, తెలుగు, హింది బాషల్లో నటించి బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.