గదిలోకి వెళ్లి చూసే సరికి వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి చెంది ఉన్నారని ఆయన పీఏ కృష్ణారెడ్డి చెప్పారు. ఉదయం తాము వివేకా ఇంటి వద్దకు వెళ్లినప్పుడు ఇంకా ఆయన డోర్‌ తెరవలేదన్నారు. దాంతో పనిమనుషులతో పాటు తాను, అంతా బయటే ఎదురుచూశామన్నారు. తర్వాత పని మనిషి వెళ్లి వెనుక వైపు ఉన్న కిటికీని గట్టికా తట్టినా లోపలి నుంచి స్పందన రాలేదన్నారు.

ఇంతలో పక్క ద్వారం తెరిచే ఉందని రంగన్న అనే వృద్ధుడు పార్కులో తిరుగుతూ చెప్పారన్నారు. దాంతో తామంతా ఒకేసారి ఇంట్లోకి వెళ్లామన్నారు. ఆ సమయంలో బెడ్‌ పక్కనే రెండు లీటర్ల మేర రక్తం పడి ఉందన్నారు. కానీ వివేకానందరెడ్డి అక్కడ లేకపోవడంతో బాత్‌రూంలోకి వెళ్లి చూశామని… అక్కడ రక్తం మడుగులో వివేకానందరెడ్డి పడి ఉన్నారన్నారు.

చేయి పట్టుకుని చూస్తే నాడి ఆడలేదన్నారు. దాంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించామన్నారు. పక్క డోర్ ఎలా ఓపెన్ అయిందన్నది తేలాలన్నారు. తలకు ముందు, వెనుక, అరచేతిలో కూడా గాయం ఉండడంలో పోలీసులకు తాను ఫిర్యాదు  చేసినట్టు పీఏ కృష్ణారెడ్డి చెప్పారు.