పోర్ట్ ఆఫ్ స్పెయిన్:మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా క్వీన్స్ పార్క్ ఓవెల్
వేదికగా విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీం ఇండియా ఘన విజయం
సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో జట్టు విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించగా.. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ రాణించాడు. తన పేస్‌తో విండీస్‌కు చుక్కలు చూపించిన భువీ.. నాలుగు వికెట్లతో జట్టు విజయానికి బాటలు వేశాడు. అయితే విండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ వికెట్‌ని తీయడమే మ్యాచ్‌ని మలుపు తిప్పిందని భువనేశ్వర్ అభిప్రాయపడ్డాడు.వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో మ్యాచ్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270గా కుదించారు. అయితే పూరన్, లివీస్‌ల జోడీ క్రీజ్‌ వద్ద ఉన్నంత వరకూ విండీస్ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ కుల్దీప్ బౌలింగ్‌లో లివీస్ పెవిలియన్ చేరగా.. భువీ బౌలింగ్‌లో పూరన్ వెనుదిరిగాడు. దీని తర్వాత మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. దీని గురించి భువీ మాట్లాడుతూ..‘‘పూరన్ వికెట్‌ మ్యాచ్‌ని మలుపు తప్పింది. అతను చాలా మంచి టగాడు..మ్యాచ్ ఫలితాన్ని మార్చే సత్తా ఉంది. రోస్టన్ చేజ్ వికెట్ కూడా చాలా కీలకమే. ఆ రెండు వికెట్‌లు చాలా పెద్దవి’’ అని భువీ అన్నాడు.