హైదరాబాద్‌: సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్సుకు  పూర్వ వైభవం చేకూరుతుందని ఆ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు-ఓటములు సహజమని, రాహుల్‌గాంధీ మళ్లీ పగ్గాలు చేపడతారని ఆశిస్తున్నట్టు చెప్పారు. కోదండరెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీజేపీ-ఆరెస్సె్‌సను ఎదుర్కొనేందుకు సోనియా మార్గనిర్దేశంలో కాంగ్రెస్‌ సమాయత్తమవుతుందన్నారు.