న్యూఢిల్లీ:పాకిస్థాన్‌లో భారత రాయబారి అజయ్ బిసారియా న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. కశ్మీర్‌ అంశంపై పాక్ హైకమిషనర్‌ బిసారియాను దేశం విడిచి వెళ్లాల్సిందిగా గత బుధవారంనాడు దాయాది దేశం ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేసిన నేపత్యంలో దౌత్యపరమైన సంబంధాలకు పాక్ కటీఫ్ చెప్పింది. పాక్‌లోని భారత రాయబారి బిసారియాను బహిష్కరించడంతో పాటు, భారత్‌కు కొత్త హై కమిషనర్ మొయిన్ ఉల్ హఖ్‌ను పంపడం లేదని కూడా తెగేసి చెప్పింది.