తిరుపతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ, కుమార్తె కవితతో కలిసి ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌, నగరి ఎమ్మెల్యే  రోజా ఇంటికి వెళ్లారు.  కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని దర్శించుకొని విశేష పూజలు నిర్వహించిన ఆయన   రోడ్డు మార్గం ద్వారా తిరిగి వస్తూ, నగరిలో  రోజా నివాసానికి  వెళ్లారు. ఆయన వెంట ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి తదితరులు ఉన్నారు.

మొదట హైదరాబాద్‌ నుంచి విమానంలో రేణిగుంటకు చేరుకుని అక్కడినుంచి రోడ్డుమార్గంలో వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు నగరిలో రోజా స్వాగతం పలికారు. అనంతరం ఆమె కూడా సీఎం కుటుంబ సభ్యులతో కలిసి కాంచీపురానికి వెళ్లారు.  తిరిగి వస్తూ రోజా ఇంటికి సీఎం కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. తరువాత  వెకటేశ్వరస్వామిని దర్శించుకోవటానికి తిరుమల వెళ్లారు.