పిచ్చి పనులతో తలితండ్రులను బాధించవద్దు - సంపూర్ణేష్ బాబు  

హైదరాబాద్‌: మదనపల్లెలో  ‘కొబ్బరిమట్ట’ సినిమాను ప్రదర్శించలేదని ఓ అభిమాని  ఆత్మహత్యాయత్నం చేశాడు.  ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో జరిగింది.  మదనపల్లెలో ‘కొబ్బరిమట్ట’ సినిమాను ఏ థియేటర్‌లోనూ ప్రదర్శించడం లేదు. దీంతో సినిమాను పట్టణంలో ప్రదర్శించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రెడ్డెప్ప అనే అభిమాని విలేకరుల సమావేశం నిర్వహించాడు. కానీ ఏ పత్రికలోనూ వార్త ప్రచురితం కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఆదివారం చంద్రా కాలనీ సమీపంలోని సెల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆయనను కిందికి తెస్సుకువచ్చిన పోలీసులు  ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 ఈ ఘటనపై సంపూర్ణేష్‌బాబు సోషల్‌మీడియాలో తన అభిమానుల్ని ఉద్దేశించి  ‘దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేసి, మీ తల్లిదండ్రులకు బాధ కలిగించకండి. సినిమా ఇప్పుడు కాకపోతే రెండు రోజుల తర్వాత చూడొచ్చు’ అంటూ ఆయన ప్రకటన విడుదల చేశాడు.