దిల్లీ: ఆర్టికల్ 370 రద్దుతో ప్లాట్ల/ఫ్లాట్ల రేట్లు పెరగనున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా బాహ్య ప్రపంచంతో సంబంధంలేకుండా స్తబ్దుగా ఉన్న స్థిరాస్తి రంగం స్పెషల్ స్టేటస్  రద్దు చేయటంతో, శ్రీనగర్ చుట్టుపక్కల రూ. 2200 - 4000 వరకే వున్న రేట్లు పెరగవచ్చని అనారాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సోమవారం తెలియచేసారు. 

అయితే రక్షణ కారణాల రీత్యా కొనుగోలుదారులు  కొంచం సందేహించ వచ్చని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అనారక్ ఛైర్మన్ అనూజ్ పూరి వెల్లడించిన వివరాల ప్రకారం...ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370 రద్దు  జమ్మూ కశ్మీర్ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగానికి చేయూతనిస్తుందని, దీన స్థితిలో ఉన్న ఆ రంగం పుంజుకోవటానికి  కేంద్రాప్రభుత్వ విప్లవాత్మక చర్యలు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. భారత దేశంలోని ఇతర ప్రాంతాలు పెట్టుబడులు పెట్టటంతో కేవలం రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా జమ్ము కశ్మీర్ ఆర్థిక పరిస్థితిలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని, దీని ద్వారా ఆ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ఆర్థికవేత్తలు  చెబుతున్నారు.