మోడి గారు  కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించండి 
చంద్రబాబు ప్రభుత్వం పంపిన కాపు రిజర్వేషన్ బిల్లు కేంద్రంలో పెండింగ్...

అమరావతి: భారత ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ మంత్రి, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వాలకు కాపు రిజర్వేషన్‌ల గురించి లేఖలు రాస్తూ వచ్చిన ముద్రగడ పద్మనాభం తన ట్రాకు మార్చారు. ఎందుకనో అకస్మాత్తుగా ఆయనకు చంద్రబాబు ప్రభుత్వం పంపిన కాపు రిజర్వేషన్ బిల్లు, కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉందని  గుర్తుకు వచ్చింది. బ్రిటీష్ వారి హాయములోకూడా కాపులకు రేజర్వాషన్ ఉండేదని, కనుక ఆ బిల్లును ఆమోదించాలని కేంద్రానికి రాసిన లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.   రాజకీయపక్షాలు తమ ఓట్లు పొంది రిజర్వేషన్ విషయంలో మోసం చేశాయని.. కాపు రిజర్వేషన్‌ అమలుకు సహకరించాలని మోదీని ముద్రగడ కోరారు.