చైనా మాయ లేడీ - కంప్యూటర్ మొరాయించటంతో బయటపడ్డ నిజం 

చైనాకు చెందిన ఓ బ్లాగ్గర్  అసలు మొఖాన్నిఫిల్టర్ లేకుండా చూసినా చాలా మంది కంగుతిన్నారు. యువర్ హైనెస్స్ షో బిల్యు అని తనని తాను పిలుచుకునే ఆవిడ వయసు నిజానికి 58 ఏళ్లని, అందరూ అనుకుంటున్నట్టు 25 ఏళ్ల యువతి కాదని తెలిసిన ఆమె ఫాల్లోయర్స్ విస్తు పోయారు. 

 యువర్ హైనెస్స్ షో బిల్యు అని తనని తాను పిలుచుకునే ఈ బ్లాగ్గరికి లైవ్ స్త్రీమింగ్ ప్లాట్ ఫార్ములో 1 లక్షా 30 వేలమంది  ఫాల్లోయర్స్ ఉన్నారు. ఆమె అసలు పేరు క్యియాబిల్యూ డియన్ షియా, అందమైన యువతిలాగా కనిపించటానికి ఫిల్టర్లు ఉపయోగించి, ఆమె ఫాన్స్ దగ్గర లక్షల రూపాయలు సంపాదించింది. 

ఆమెను అందమైన దేవతగా వర్ణిస్తూ ఎంతోమంది ఆమెకు అభిమానులయ్యి, బహుమతులు సమర్పించుకున్నారు. ఆమె ప్లానంతా పాడు చేస్తూ, ఇటీవల సాంకేతిక కారణాలవల్ల ఆ మాయా లేడీ వెనుక అసలు నిజం బయటకు వచ్చింది.