200కు పైగా మృతి... 12 లక్షలకు పైగా నిరాశ్రయులు...

గుజరాత్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రాలలో, ఉత్తరాఖాండ్, కాశ్మీర్ వరదలలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. 12 లక్షలకు పైగా నిరాశ్రయులయ్యారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.  వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, దొరికినచోట తలదాచుకొని బిక్కుబిక్కు మంటూ సహాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు.  

చాలా చోట్ల వర్షాలు ఆగి,  వరదనీరు తగ్గటంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 

అధికార వర్గాల ప్రకారం  కేరళలో అధిక నష్టం జరిగింది. ఇప్పటివరకు85 మంది ప్రాణాలు కోల్పోగా, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రాలలో 116 మంది మరణించారు. 50 మంది జాడ ఇప్పటివరకూ తెలియలేదు. 

భారీ వర్షాలవల్ల కొండ చరియాలు విరిగి పడటంతో ఉత్తరఖాండ్, జమ్ము కాశ్మీర్లో 9 మంది చనిపోయారు. వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలలో వరశాల కారణంగా సోమవారంనాడు 5గురు మరణించారు. 
మళ్ళీ రానున్న కష్టం:
రాగల 48 గంటల్లో  కేరళ దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు వచ్చే  సూచనులున్నాయని భారత  వాతావరణ శాఖ తెలిపింది.