రెండు నెలలుగా సాగుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చటంతో సోమవారం మూసివేసిన  హాంగ్ కాంగ్ ఎయిర్ పోర్ట్,  మంగళవారం తిరిగి తెరిచారు. నిరసన ప్రదర్శనలో ఉగ్రవాద ఛాయలు కనిపిస్తున్నాయని చైనా హెచ్చరించిన నేపధ్యంలో ,  అధికారులు విమానాల రాకపోకలపై ఇంకా నిషధం కొనసాగవచ్చని హెచ్చరించారు. ప్రపంచంలోనే రద్దీగా ఉండే ఎయిర్ పోర్టులలో ఒకటిగా పేరు పొందిన ఈ విమానాశ్రయం నుండి, హాంగ్ కాంగ్ అధికార విమానయాన సంస్థ క్యాతీ పసిఫిక్ 200 సెర్వీసులు రద్దు చేశామని తమ వెబ్ సైట్ ద్వారా తెలిపింది.

నిరసనకారులు  5 రోజులనుండీ శాంతియుతంగా యరైవల్ హాల్ పూర్తిగా ముట్టడించి తమ నిరసన కొనసాగిస్తున్నారు. విమానాశ్రయానికి సంబంధించినతవరకు ఎలాంటి ఘటన జరగక పోయినప్పటికీ ఎయిర్ పోర్ట్ మూసివేయడానికి నిజమైన కారణం ఏమిటని ఇప్పటిదాకా తెలియలేదు. 

అయితే విమానాశ్రయాన్ని మంగళవారం  పొద్దున్న కాసేపు తెరిచిన అధికారులు ఆందోళనకారులు విమానాశ్రయాన్ని దిగ్భందించడంతో హాంగ్ కాంగ్ నుండి అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది.