ముంబై: హిందీ ‘బిగ్‌బాస్’ విన్నర్‌గా నిలిచిన టీవీ నటి ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అసభ్యపదజాలంతో దూషించాడని, కూతురికి అశ్లీల ఫొటోలు చూపిస్తూ కొడుతున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కండివాలి  పరిధిలోని సమత  నగర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఈ టీవీ నటి రెండో భర్తపై తాజాగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. 2013లో ఈ టీవీ నటి రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. 2016లో వీరికి పాప పుట్టింది. ఆమె ఫిర్యాదు పోలీసులు భర్తను అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.