అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌ను పూర్తిస్తాయిలో నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న గౌతం సవాంగ్‌ను ఇన్‌చార్జి డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ శాఖకు డీజీగా బదిలీ చేసింది. ఇన్‌చార్జి డీజీపీగా సవాంగ్‌ చాలా చక్కగా పనిచేస్తుండటం.. సీనియర్‌ అధికారి కావడంతో ప్రభుత్వం ఆయనను పూర్తిస్థాయిలో నియమించినట్టు తెలుస్తోంది.