పరిశ్రమలు-ఉద్యోగాలు...

అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశ్రమలు, వాణిజ్యంపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో జరుగిన ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రోజా, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాల అమలుకు వీలుగా నైపుణ్యమున్న మానవనరులను తయారుచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లకోసం 25 ఇంజినీరింగ్‌ కాలేజీలను గుర్తించే ప్రక్రియ వేగంగా జరగాలని అన్నారు. పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యున్నత పారదర్శక విధానాలను పారిశ్రామిక వర్గాలకు వివరించాలని సీఎం చెప్పారు. నౌకాశ్రయాలు, ఎయిర్‌ పోర్టులు, మెట్రోరైళ్లు, ఎలక్ట్రిక్‌ బస్సులు తదితర బీఓటీ ప్రాజెక్టులపైన దృష్టిపెట్టి పెట్టుబడులను ఆకర్షించాలని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టులకు గ్లోబల్‌ టెండర్లు వేసి.. తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని వెల్లడించారు. పెట్టబడులను ఆకర్షించేలా రాష్ట్రానికి కొత్త నినాదం తీసుకురావాలని చెప్పారు.

ముఖ్యమంత్రా?... ప్రతిపక్షనాయకుడా...?

 ‘ఇజ్రాయెల్‌ పర్యటనలో చూశాను. అక్కడ డీ శాలినేషన్‌ వాటర్‌ను వాడుతున్నారు. ఒక్క రూపాయికే 25 లీటర్ల తాగునీరు ఇస్తున్నారు. రూ.2 కే 20 లీటర్ల రక్షిత నీరు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన చంద్రబాబు మాట తప్పారు’ అంటూ ఇంకా చంద్రబాబును విమర్శించటం చూస్తుంటే, ఆయన ఇంకా పూర్తిగా ప్రతిపక్ష నాయకుడి పాత్ర  నుంచి బయటపడ్డట్టు కనిపించటం లేదు.