న్యూఢిల్లీ : నింగివైపు చూస్తున్న బంగారం ధరలు పెట్టుబడి దారుల్లో ఆశలు రేకెత్తిస్తుండగా, ఆభరణాల వినియోగదారులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి పరుగుకు ఇప్పట్లో  బ్రేక్‌లు పడే అవకాశం కనిపించడంలేదు.  ముఖ్యంగా పాకిస్తాన్‌లో పుత్తడి  ధర వింటే  గుండె గుభేలే. అవును.. ఇండియాతో పోలిస్తే.. పాకిస్తాన్‌లో బంగారం ధర రెండింతలు ఎక్కువ పలుకుతోంది.  నిన్న (సోమవారం ,ఆగస్ట్ 12) పాకిస్తాన్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.74,588గా ఉంది. పాకిస్తాన్ పరిమాణంలో తులా బార్స్ (11.6638038 గ్రా) బంగారం రూ.87,000 గా ఉంది. పాకిస్తాన్‌లోని ఒక్కో నగరంలో ఒక్కో ధర పలుకుతోంది.