సాహో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్న ప్రభాస్‌, ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలను పలకరించిన యంగ్ రెబల్‌ స్టార్‌ వరుసగా మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు.బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ప్రభాస్‌ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ వార్తలపై స్పందించిన ప్రభాస్‌ అవన్నీ రూమర్స్‌ అంటూ కొట్టి పారేశాడు. అంతేకాదు అనుష్కతో తాను డేటింగ్‌లో ఉన్నట్టుగా వస్తున్న వార్తల్లోనూ నిజం లేదన్నాడు. ప్రస్తుతం సాహో ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ప్రభాస్‌ ఆ తరువాత జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నాడు.