నాగర్‌కర్నూల్‌: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని అల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి జూరాలకు అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తెంది. కృష్ణానదిలో లక్షల క్యూసెక్కుల నీరు పరుగులు పెడుతున్నా నీళ్లు తోడుకోలేని దుస్థితి ఏర్పడింది. కేఎల్‌ఐ రెండో లిఫ్ట్‌లో విద్యుత్‌ సాంకేతిక లోపం కారణంగా మూడు లిఫ్ట్‌ల పరిధిలోని నీటి పంపింగ్‌ నిలిచిపోయింది. కల్వకుర్తి మొదటి లిఫ్ట్‌ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు, ఎల్లూరు నుంచి సింగోటం, అక్కడి నుంచి జొన్నలబొగుడ రిజర్వాయర్‌కు వచ్చి చేరిన నీరు ముందుకు వెళ్లడం లేదు. గుడిపల్లి గట్టు వద్ద ఉన్న మూడో లిఫ్ట్‌లో సర్జిపూల్‌ పంపుల్లో విద్యుత్‌ వ్యవస్థకు పని చేయకపోవడంలో పంపింగ్‌ నిలిచిపోయింది. మూడో లిఫ్ట్‌ పనిచేయకపోవడం, ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ రిజర్వాయర్లు నిండిపోవడంతో మొదటి, రెండో లిఫ్ట్‌లలో కూడా నీటిని ఎత్తిపోయకుండా అధికారులు పంపులను నిలిపివేశారు