ముంబై: అమెరికా, యూరప్ మార్కెట్ల ఈక్విటీ ప్యూచర్లు పడిపోవడంతో భారత మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 624 పాయింట్లు, 1.66 శాతం నష్టపోయి 36,958 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 184 పాయింట్లు, 1.65 శాతం నష్టపోయి 10,926 వద్ద స్థిరపడింది. ఎస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, గ్రాసిమ్ ఇండస్ట్రిస్, ఐషెర్ మోటార్స్, ఐటీసీ, మారుతి సుజూకీ, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి.