విశ్రాంతి లేకుండా అదేపనిగా మనకిష్టమైన ఎపిసోడులు టి‌విలో  చూడటం వల్ల మెదడు సరిగ్గా పనిచేయదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

మెదడు ఏకాకిగా పనిచేసే అవయువం కాదని, అది పరిసరాలను బట్టి స్పందిస్తుందని హోస్టన్ మేథోడిస్ట్ న్యూరాలజిస్ట్  డా, రాండల్ రైట్ అన్నారు. ఎవరైనా వ్యక్తులు అదేపనిగా టి‌వి చూస్తే, మెదడుకు అనారోగ్యకరమైన వాతావారణం కల్పిస్తామని అన్నారు. ఎందుకంటే ఏ పని చేయకుండా ఎక్కువ సేపు కూర్చొని, సామాజిక కార్యకలాపాలకీ దూరంగా ఉంటూ, అనారోగ్యకర తిళ్ళు తినటం వల్ల మెదడుకూడా చురుకుగా ఉంటుంది అన్నారు. 

ఒక ఎపిసోడ్ తరువాత ఇంకొక ఎపిసోడు అదేపనిగా చూడటానికి, జూద వ్యసనానానికి ఏమి వత్యాసం లేదంటున్నారు డా. రాండల్ రైట్.