న్యూఢిల్లీ: తనకు భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీ ప్యానల్‌లో సభ్యుడు కావాలని ఉందని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌మనసులోని మాటను బయటపెట్టాడు. తనకు సెలక్టర్‌ కావాలని ఎంతో ఆశగా ఉందని, కానీ ఆ చాన్స్‌ ఎవరిస్తారని ట్వీట్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సెహ్వాగ్‌.. ఆలోచింప చేసే ట్వీట్లు చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటాడు. తాజాగా సోమవారం సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో ‘నాకు సెలక్టర్‌ కావాలనుంది. కానీ అవకాశం ఇచ్చేదెవరు’ అంటూ కామెంట్ పోస్టు చేశాడు. సాధారణంగా సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఎక్కువగా సరదా సందేశాలే పెడుతుంటాడు కాబట్టి.. ఈ ట్వీట్‌ ఉద్దేశమేంటన్నది అతనే చెప్పాలి మరి.