న్యూఢిల్లీ : తాను స్వచ్ఛంద సంస్థ కార్యకర్తనని చెప్పి ఓ మహిళ తీహార్ జైలును సందర్శించిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. ఓ మహిళ తాను స్వచ్చంద సంస్థ కార్యకర్తనని చెప్పి మంగళవారం తీహార్ జైలుకు వచ్చి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న హేమంత్ అనే ఖైదీని కలిసింది. పకడ్బందీ భద్రత మధ్య ఉన్న తీహార్ జైలులోకి ఓ మహిళ తప్పుడు డాక్యుమెంట్లతో ప్రవేశించిందని జైలు అధికారుల దర్యాప్తులో తేలింది. జైలు సూపరింటెండెంట్ విధినిర్వహణలో నిర్లక్ష్యం వల్లనే మహిళ తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి జైలును సందర్శించిందని అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంపై జైళ్ల శాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.