భారత్ సంతతికి చెందిన మాజీ సింగపూర్ పోలీసు...
ఫోనులో 700లకు పైగా యువతుల నగ్న చిత్రాలు...

వెబ్ డెస్క్: ముగ్గురు మైనర్లను లైంగికంగా వేధించిన కేసులో ఏ‌ఆర్ అరుణ్ ప్రశాంత్ అనే మాజీ సింగపూర్ పోలీసుకు 2 సంవత్సరాల జైలు శిక్ష పడింది.   5గురు బాధితుల్లో శృంగారం జరిపిన ముగ్గురు బాలికల వయసు  12 నుంచి 15 సంవత్సరాల లోపే. అతని మొబైల్ ఫోనులో 700లకు పైగా యువతుల నగ్న చిత్రాలు తీసి దాచుకున్నాడని సమాచారం. 

మాజీ సింగాపూర్ పోలీసు ఫోర్స్ ఉద్యోగి అయిన అరుణ ప్రశాంత్, ఆన్లైన్లో ఆడ పిల్లలకు ఏర వేసి, వారిని బలవంతంగా శృంగారంలోకి దించేవాడు. ఈ ముగ్గురే కాకుండా  ఇంకొక నాలుగు కేసుల్లో  అసభ్యంగా ప్రవర్తించినట్టు ఒప్పుకున్నాడు.
మొత్తం 21 కేసులు అతని మీద నడిచాయి. 

నీవు చేసిన దారుణం వల్ల ఆ ఆడపిల్లలకి ఎంత పూడ్చలేని నష్టం జరిగిందో తెలుసుకుంటావని ఆశిస్తున్నాను అంటూ 2 సంవత్సరాల జైలు శిక్ష విదించిన డిస్ట్రిక్ట్ జడ్జి కేస్స్లర్ సోహ్ వ్యాఖ్యానించారు.