పాకిస్తానులో పాడినందుకుగాను మికా సింగ్ ను ఏ‌ఐ‌సి‌డబల్యూ‌ఏ బాన్ చేసింది. అగ్రశ్రేణి గాయకుడైన మికా సింగ్ పాకిస్తునులో ఒక పెళ్లి వేడుకలో పాడినందుకుగాను  అల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆయన్ను సినీ పరిశ్రమనుంచి బాన్ చేసింది. బాయికాట్  చేయడం వల్ల సినీ పరిశ్రమకు చెందినవారెవ్వరు ఆయనతో కలిసి పనిచేయరని తెల్పింది. 

ఆయన పాకిస్తానులో, ఓ పెళ్ళిలో  పాడిన వీడియో ఒకటి వైరల్ అవ్వటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మికా సింగ్ దేశానికన్నా డబ్బుకి ఎక్కువ విలువ.ఇచ్చి మాజీ.పా.కిస్తాన్ ప్రెసిడెంట్ ముష్రాఫ్ బంధువు కూతురి పెళ్ళిలో 14 మంది ట్రూప్ తో సహా వెళ్ళి ప్రదర్శన ఇచ్చాడు అని అసోసియేషన్ భావించింది.  ఈ ప్రదర్శనకు గాను మికా సింగ్ కోటి  రూపాయాలు తీసుకున్నారని తెలిసింది.