కరీంనగర్: రామడుగు మండలం కొరటపల్లికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రవి కథనం ప్రకారం కొరటపల్లికి చెందిన యువతి కరీంనగర్‌కు వెళ్తుండగా ఇదే గ్రామానికి చెందిన మేకల నరేష్‌ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై కరీంనగర్‌ వరకు తీసుకెళ్తానని నమ్మించాడు. బైక్‌పై వెళ్తూ మార్గమధ్యంలో కొక్కెరకుంట ప్రాంతంలో భయబ్రాంతులకు గురిచేసి అత్యాచారం చేసినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.