డిల్లీ: డిల్లీకి దగ్గరే ఉన్న ఫరీదాబాద్ లో ఒక సీనియర్ ఐ‌పి‌ఎస్ అధికారి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు డిపార్టుమెంట్ కి చెందిన ఒక ఇన్స్పెక్టర్,  అతనితో పాటుగా ఇంకొక వ్యక్తి పేరు సూసైడ్ నోటులో ఉన్నట్టు సమాచారం.  

ఫరీదాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, విక్రమ్ కపూర్ సెక్టార్ 30లోని తన ఇంట్లో, సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని మరణించారు. తుపాకి శబ్దం విన్న కుటుంబ సభ్యులు పరుగెత్తుకొని వచ్చి చూడగా, రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన శరీరం కనిపించింది. 
ఫరీదాబాద్ పోలీస్ లైన్స్ లోని ఆయన ఇంట్లో ఉదయం 06.00 గంటలకు ఆత్మహత్య చేసుకున్నారని, కేసు దర్యాప్తు జరుగుతోందని ఫరిదాబాద్ పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుబే సింగ్ ప్రకటనలో తెలియచేశారు. ఆయన  సూసైడ్ నోటులో  స్టేషన్ హౌస్ ఆఫీసర్ భూపాణి అబ్దుల్ షహీద్, ఇంకొక వ్యక్తితో కలసి గత కొన్ని రోజులుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వ్రాసారని, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయంపై ఒక కంప్లయింట్ కూడా ఇచ్చారని ఆయన తెలిపారు. 

ఆయన నోటులో ప్రస్తావించిన ఇద్దరినీ ఇంటరాగేట్ చేసినట్టు తెలిసింది.