దిల్లీ: తన మిగ్-21 కూలిపోయిన తరువాత, పాకిస్తాన్ కస్టడీలో దాదాపు 60 గంటలు గడిపిన వింగ్ కమాండర్ అభిందన్ వర్ధమాన్, ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వీర్ చక్ర అవార్డ్ స్వీకరించపోతున్నారు. 
 
ఫిబ్రవరి 27వ తారీఖున పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలతో జరిగిన డాగ్ ఫైట్ లో పాకిస్తాన్ విమానాన్ని కూల్చి, ఆ తరువాత తన విమానం కూలిపోవటంతో పాకిస్తాన్ చేతిలో బందీగా గడిపిన వీర కిశోరం అభినందన్ వర్థమాన్ భారతీయుల  గుండెల్లో నిలిచిపోయారు. పుల్వామా దాడికి ప్రతిగా ఇండియా పాకిస్తాన్ బాలకోట్ టెర్రరిస్ట్ కాంపుల మీద దాడి జరిపిన మరునాడు పాక్ ఎఫ్-16లతో డాగ్ ఫైట్ చోటు చేసుకుంది.