విరాట్ కొహ్లీ-రోహిత్ శర్మల కాంబినేషన్ భారత క్రికెట్ జట్టుకి ఎన్నో విజయాలను అందించింది. వారిద్దరు కలసినప్పుడల్లా ఆటలో వేగం పెరిగి, విపత్కర పరిస్థితులలో కూడా దేశానికి విజయాన్నందించారు. ఇప్పుడు వారిద్దరు కొత్త చరిత్ర సృష్టించటానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు క్వీన్ పార్క్ ఓవల్ లో  జరుగుతున్న ఆఖరి వన్ డేలో 27 రన్నులు సాధించగలిగితే ప్రపంచ క్రికెట్ చరిత్రలో వెస్ట్ ఇండీస్ మీద 1000 రన్నులు సాధించిన జంటగా రికార్డు సృష్టిస్తారు.   

మంచి ఫార్మ్ తో రెండవ  ఒక రోజు క్రికెట్లో 42వ శతకం సాధించిన కొహ్లీ మాజీ కాప్టన్ సౌరవ్ గంగూలీ రికార్డు బద్దలు కొట్టి, టెండూల్కర్ రికార్డ్ వైపు దూస్కెళుతున్నాడు. 

ఇంకొక వైపు ఎడమ చేతి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంకొక 4 వికెట్లు సాధిస్తే, అత్యంత వేగంగా ఒన్ డేలలో 100 వికెట్లు సాధించిన ఆటగాడుగా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పుడు మహమ్మద్ షమి 56 ఒన్ డేలలో సాధించిన రికార్డు బద్దలవుతుంది.