ముంబాయి: రానున్న 18 నెలల్లో  రెలియన్స్ ఇండస్ట్రీస్ ఋణ రహిత (జీరో డెట్)  కంపెనీ కాబోతున్నాడని కంపెనీ సి‌ఎం‌డి ముఖేష్ అంబానీ తెలిపారు. 
తమ కంపెనీ మొత్తం రుణాలు ($ 22 బిలియన్) 1.54 లక్షల కోట్లని ఆయన తెలిపారు. వచ్చే 18 నెలల్లో, అంటే మార్చ్ 31, 2021 కల్లా సంస్థని రుణం లేని కంపెనీగా చేయటానికి తమ వద్ద చక్కటి ప్లాన్ ఉన్నదని చెప్పారు. 42వ కంపెనీ ఏ‌జి‌ఎం లో ప్రసంగించిన ఆయన రాబోయే రోజుల్లో ప్రపంచంలో అత్యుత్తమ బాలన్స్ షీట్ ఉన్న కంపెనీలలో తమ కంపెనీ ఒకటి అవుతుందని ఆయన అన్నారు. 

బి‌పి, సౌదీ అరమ్కోలతో కలసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ల ద్వారా రెండు సంస్థలకి లబ్ది చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ రెండు సంస్థల ద్వారా 1.1 లక్షల కోట్లు పెట్టుబడులు సంకూరనున్నాయని తెలిపారు. విదేశీ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ స్వీస్ రిలియన్స్ సంస్థ మొత్తం రుణాలు 65 బిలియన్  డాలర్లుగా లెక్కించటం గమనార్హం.