అమరావతి:స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకోగా.. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనసేన కార్యకర్తల నడుమ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. జెండాకు సెల్యూట్ చేసి వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.