హైదరాబాద్ :సూపర్‌ స్టార్ మహేష్ బాబు స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇటీవల సరిలేరు నీకెవ్వరు టీజర్‌లో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా టైటిల్‌సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇండియన్‌ ఆర్మీకి ట్రిబ్యూట్‌గా ఈ పాటను విడుదల చేశారు సరిలేరు నీకెవ్వరు టీం. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ పాటను సైకిల్‌ ఫోటోలు వీడియోలతో రిలీజ్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో 13 ఏళ్ల తరువాత లేడీ సూపర్‌ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ 2020 సంక్రాంతికి విడుదల కానుంది.