వెబ్ డెస్క్:  ఫిలాడెల్ఫియాలో ఒక నిందితుడు 6గురు పోలేసులపై కాల్పులు జరిపాడు. స్థానిక కాలమానం ప్రకారం బుదవారం మద్యాహ్నం కాల్పులు జరిగినట్టు తెలిసింది. ఆరుగురు పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఫిలడెల్ఫియా పబ్లిక్ అఫైర్స్ యూనిట్ కి చెందిన సార్జెంట్ ఎరిక్ గ్రిప్ ఇచ్చిన సమాచారం ప్రకారం రాత్రి 10.00 గంటలవరకూ షూటింగ్ కొనసాగుతూనే ఉంది. 

నైస్ టవున్-టియోగాలో ఉన్న రో హౌస్ లోపల నిందితుడు దాగి ఉన్నట్టు తెలిసింది. సామాన్య పౌరులెవ్వరూ ఆ వేపు పోకుండా నిషేధించారు.  

డ్రగ్ రైడ్ కోసమని ఆ ఇంట్లోకి వెళ్ళిన ఇద్దరు పోలీసులను రక్షించి క్షేమగా బయటకు తీసుకువచ్చారు. ఆ తరువాత ఈ కాల్పులు మొదలయ్యాయి. ఫిలాడెల్ఫియా పోలీస్ కమిషనర్ రిచర్డ్ రాస్ తమ అధికారులు నిందితుడితో మాట్లాడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారన్నారు.