పోర్ట్ ఆఫ్ స్పెయిన్: బుధవారం వెస్టిండీస్‌తో మూడో వన్డేలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విజృంభించి ఆడుతుండగా  కీమర్‌ రోచ్‌ వేసిన 27 ఓవర్‌లో కోహ్లి కుడి చేతి వేలికి గాయమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, లక్ష్య చేధనలో ముందుండి జట్టుకు విజయాన్ని అందించాడు. విండీస్  తన వన్డే కెరీర్‌లో 43వ శతకం సాధించాడు. ఈ క్రమంలో కోహ్లీ స్వల్పంగా గాయపడ్డాడు. కీమర్‌ రోచ్‌ వేసిన 27 ఓవర్‌లో కోహ్లి కుడి చేతి వేలికి గాయమైంది. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి కోహ్లీకి చికిత్స అందించాడు. ఆ తర్వాత గాయంతోనే బ్యాటింగ్ కొనసాగించిన కోహ్లీ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
 
అయితే విండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కి ముందు కోహ్లీకి గాయం కావడంతో జట్టులో జుట్టులో ఆందోళన నెలకొంది. తనకేం కాలేదని దెబ్బ చిన్నదేనని  కోహ్లీ తెలిపాడు. స్టార్ బాట్స్ మాన్  కోహ్లీ గాయం కారణంగా ఆటకి దూరం అయితే జట్టుకి పెద్ద దెబ్బ అయివుండేది.