అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ పునరుద్ధరించమంటూ జగన్ ప్రభుత్వాన్ని బుధవారం హై కోర్టు ఆదేశించింది. 
జస్టిస్ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్, రాష్ట్ర ప్రభుత్వం తన రక్షణను తగ్గించటం పై చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషను  విచారించిన హై కోర్టు 97 మంది సెక్యూరిటీ సిబ్బందితో కూడిన రక్షణనివ్వమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఆగస్ట్ 02వ తారీఖున ఆర్డర్స్ రేజర్వ్ చేసిన హై కోర్టు, ప్రధాన ప్రతిపక్షనాయకుడికి తగిన రక్షణ సిబ్బందితో సెక్యూరిటి కవర్ కల్పించమని, రక్షక వాహనాలలో జామ్మర్ సదుపాయం కల్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. 

జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన అన్నీ కార్యక్రమాలని పునస్సమీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన చర్యలన్నీ కక్షపూర్తంగా ఉంటున్నాయని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.  హై కోర్టు ఆదేశాలు రాష్ట్రప్రభుత్వానికి చెంపపెట్టువంటిదని వారంటున్నారు.