నల్లగొండ: ఉప్పొంగి పోరులుతున్న కృష్ణవేణి అందాలను చూసి ఆనందించటానికి, సెలవురోజు అవటంతో నాగార్జునసాగర్‌కు పర్యాటకులు భారీగా తరలివచ్చిచారు. అయితే సెలవురోజు ఆనందంగా గడుపదామని వచ్చిన సందర్శకులను  సరిగా అంచనా వేసి కావలసిన ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వం విఫలమయ్యింది. అప్రమత్తతో వ్యవహరించ వలసిన అధికారులో కూడా సెలవల్లో విహార యాత్రకు వెళ్లారో ఏమో కానీ నదీ అందాలు చూసి ఆనందిద్దామనుకున్న పర్యాటకులు కష్టపడుతున్నారు.   సందర్శకుల తాకిడి కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివక్కడే  నిలచి పోయాయి.  ట్రాఫిక్ నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో ప్రయాణీకులకు చుక్కలు కనిపిస్తున్నాయి