కాపాడేందుకు అధికార పార్టీ నాయకుల  పైరవీలు...

నెల్లూరు: :  ఊటుకూరు గ్రామంలో ఓ  బాలికపై యజమాని అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. రొయ్యల చెరువుల యజమాని అయిన కళాధర్ కొంతకాలం క్రితం తన వద్ద జీతానికి పనిచేస్తున్న తల్లీకూతుళ్ల మీద కన్నేశాడు. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె భర్తను బెదిరించి తరిమేశాడు. అంతటితో ఆగని ఆ కామపిశాచి, 13 ఏళ్ల బాలికైన ఆమె కూతురుమీద కన్నేశాడు. తల్లిని ఒప్పించి కూతురిపై అత్యాచార యత్నం చేశాడు. ఆ కీచకుడి బాధ తట్టుకోలేని ఆ బాలిక ఇంటినుంచి పారిపోయింది. 
కూతురి జాడ తెలీటంలేదంటూ తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే ఈ దారుణ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. 

విచారణలో వాస్తవాలు వెల్లడైన అధికార పార్టీ నాయకుల వత్తిళ్ల కారణంగా పోలీసులు కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ గిరిజన సంక్షేమ నాయకులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. 

తహసీల్దారు పద్మావతి మైనర్‌ బాలికను విచారించి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బాలిక వాంగ్మూలాన్ని తీసుకుని నెల్లూరు బాలికల హోంకు తరలించారు.