వెబ్ డెస్క్: హాంగ్ కాంగ్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న చైనా ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోదు అన్నారు హాంగ్ కాంగ్ లో బీజింగ్ దౌత్యవేత్త ల్యు షామింగ్.  తమ ప్రభుత్వం వద్ద నివారణ మార్గాలున్నాయని తెలిపారు. 

హాంగ్ కాంగ్ సరిహద్దు పక్కనే ఉన్న షెంజెన్ నగరంలో సాయుధ దళాలను పెద్ద ఎత్తున సిద్ధంగా ఉంచిన నేపద్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
లండన్ లో ఒక పత్రికా సమేవేశంలో మాట్లాడిన ఆయన చైనాలో భాగమైన
కూడా హాంగ్ కాంగ్ ప్రత్యేక వ్యవస్థతో నడుస్తుందన్నారు. చైనా సరైన చర్యలు తీసుకొని, అశాంతిని అణిచివేస్తుందన్నారు. 

హాంగ్ కాంగ్ లో లక్షలమంది ప్రదర్శనకారులు నెలల తరబడి చైనా
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతూనే ఉన్నారు.
విమానాశ్రయంకూడా దిగ్బంధించి, విమానాల రాక పోకలకు కూడా
అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే.