లండన్: భారత దేశమంతా స్వతంత్రదినోత్సవం ఆనందోత్సాహలతో
జరుపుకుంటుండగా  పాకిస్తానీయులు కాశ్మీర్ విషయమై లండన్లోని భారత
హై కమిషన్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు.  

కాశ్మీర్ రగులుతోంది, కాశ్మీర్ విడిపించండి, మోడీ టీ చెయ్యి యుద్ధంకాదు అంటున్న పోస్టర్లను చేతబట్టి వేలాదిమంది పాకిస్తానీయులు లండన్లోని భారత హై కమిషన్ ఎదురుగా ఆర్టికల్ 370 రద్దుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. వేలాదిమంది ప్రదర్శనకారులు పాకిస్తాన్, కాశ్మీర్ జెండాలు పట్టుకుని కాశ్మీరుకు మద్దతుగా నినాదాలు చేశారు. 

ఈ సందర్భగా జరిగిన గొడవలో ఒక వ్యక్తి గాయపడగా, పోలీసులు నలుగిరిని అరెస్టు చేశారు.