న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జెట్లీ ఆరోగ్యం క్షీణిస్తూంది: కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటూ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్య
పరిస్థితి విషమంగా ఉంది. ఈనెల 9న ఆస్పత్రిలో చేరిన జైట్లీకి సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. జైట్లీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పరామర్శించారు. ఎయిమ్స్‌లో చేరినప్పటి
నుంచి జైట్లీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.కాగా నరేంద్ర మోదీ తొలి సర్కార్‌లో పలు కీలక శాఖలు నిర్వహించిన 66 సంవత్సరాల జైట్లీ అనారోగ్య కారణాలతో 2019 లోక్‌సభ ఎన్ని కల్లో పోటీ
చేయని సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైట్లీ వైద్య చికిత్స నిమిత్తం అమెరికాలో ఉండటంతో పీయూష్‌ గోయల్‌ ఆయన స్ధానంలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మోదీ ప్రభుత్వం రెండోసారి
పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం తన ఆరోగ్య పరిస్థితి సహకరించనందున తాను ప్రభుత్వంలో, క్యాబినెట్‌లో ఎలాంటి బాధ్యత నిర్వహించలేనని అరుణ్‌ జైట్లీ ప్రధానికి లేఖ రాశారు.